🎯 ఏపీ సేవ పోర్టల్: కొత్త పెన్షన్ దరఖాస్తు విధానం, డాక్యుమెంట్లు & SLA పూర్తి గైడ్
రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సేవ (AP Seva) పోర్టల్ ద్వారా నూతన సామాజిక పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునే ప్రజలకు మరియు దరఖాస్తులను ఆన్లైన్ చేసే సచివాలయ సిబ్బందికి ఉపయోగపడే పూర్తి మార్గదర్శకాలు ఇక్కడ అందించబడ్డాయి.
ముఖ్య గమనిక: ఏపీ సేవ పోర్టల్‌లో పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితం! లబ్ధిదారుల నుండి సచివాలయ సిబ్బంది ఎలాంటి రుసుము లేదా ఫీజు వసూలు చేయకూడదు.
1. దరఖాస్తుకు కావాల్సిన ప్రాథమిక పత్రాలు (Mandatory Documents)
ఏ కేటగిరీ పెన్షన్‌కు దరఖాస్తు చేసినా కింది 4 ప్రాథమిక పత్రాలు తప్పనిసరిగా జతచేయాలి:
- ఆధార్ కార్డు: గుర్తింపు ధృవీకరణ కోసం.
- రైస్ కార్డు / ఆదాయ ధృవీకరణ పత్రం: కుటుంబ ఆదాయం నిర్ధారించడానికి.
- కుల ధ్రువీకరణ పత్రము: ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ లబ్ధిదారులకు వయస్సు సడలింపు వర్తించాలంటే ఇది తప్పనిసరి.
- ఆధార్ అప్డేట్ హిస్టరీ: వయస్సు నిర్ధారణ కోసం మరియు గతంలో వయస్సు మార్పులు చేయలేదని పరిశీలించడానికి ఇది అత్యంత కీలకం.
2. కేటగిరీల వారీగా జతచేయాల్సిన అదనపు సర్టిఫికెట్లు
పైన పేర్కొన్న ప్రాథమిక పత్రాలతో పాటు లబ్ధిదారులు అడిగే పెన్షన్ రకాన్ని బట్టి కింది అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:
- వృద్ధాప్య పెన్షన్ (O.A.P): ప్రాథమిక పత్రాలు సరిపోతాయి (వయస్సు 60 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 50 ఏళ్లు నిండి ఉండాలి. ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది).
- వితంతు పెన్షన్ (Widow): భర్త మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) మరియు మరణించిన భర్త ఆధార్ కార్డు.
- ఒంటరి మహిళ పెన్షన్ (Single Women): వివాహమై విడిపోయిన వారైతే కోర్టు/అదాలత్ జారీ చేసిన విడాకుల పత్రం (Divorce Decree); పెళ్లి కాని వారైతే తహశీల్దార్ నుండి 'నాన్-మ్యారేజ్' సర్టిఫికెట్.
- వికలాంగుల పెన్షన్ (Disabled): 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ధృవీకరించే ఆన్లైన్ SADAREM సర్టిఫికెట్.
- ట్రాన్స్‌జెండర్ పెన్షన్: జిల్లా మెడికల్ బోర్డ్ (District Medical Board) సర్టిఫికెట్.
- డప్పు కళాకారులు & చర్మకారుల పెన్షన్: సాంఘిక సంక్షేమ శాఖ (Social Welfare Dept) నుండి ధృవీకరణ పత్రం.
- గీత కార్మికుల పెన్షన్ (Toddy Tappers): ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సర్టిఫికెట్.
- చేనేత కార్మికుల పెన్షన్ (Weavers): హ్యాండ్లూమ్ & టెక్స్టైల్ డిపార్ట్మెంట్ సర్టిఫికెట్.
- మత్స్యకార పెన్షన్ (Fishermen): మత్స్య శాఖ (Fisheries Dept) నుండి వృత్తి ధృవీకరణ పత్రం.
3. దరఖాస్తు ప్రక్రియ & సచివాలయ సిబ్బంది OTP అథెంటికేషన్
ఏపీ సేవ పోర్టల్‌లో పెన్షన్ దరఖాస్తును సరిగ్గా ఆన్లైన్ చేయడానికి సచివాలయ సిబ్బంది పాటించాల్సిన క్రమం:
డిజిటల్ అసిస్టెంట్ (DA) లేదా వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (WEDS) తమ ఏపీ సేవ లాగిన్ ద్వారా అప్లికేషన్ ఫారం ఓపెన్ చేసి, లబ్ధిదారుని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి.
దరఖాస్తుదారుని ఆధార్ Authentication ( OTP - Biometric) ద్వారా eKYC పూర్తి చేయాలి
దరఖాస్తుకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను స్కాన్ చేసి పోర్టల్ లో సూచించిన వాటికి అప్లోడ్ చేయవలెను
అప్లికేషన్ ఫారం మొత్తం పూర్తి అయ్యాక, చివరగా సబ్మిట్ చేసే సమయంలో డిజిటల్ అసిస్టెంట్ (DA) లేదా WEDS తమ సొంత ఆధార్ OTP అథెంటికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. సిబ్బంది OTP అథెంటికేషన్ పూర్తయితేనే అప్లికేషన్ ఆన్లైన్లో విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
డిజిటల్ అసిస్టెంట్/(WEDS) వారి లాగిన్ నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, చెక్ లిస్ట్ నమోదు చేసిన అప్లికేషన్లను recommended లేదా not recommended సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసిన అప్లికేషన్లు పెన్షన్ రకమును బట్టి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ అవుతాయి, వారి నుండి ఫైనల్ అప్రూవల్ కి MPDO/ MC వారి లాగిన్లకు ఫార్వర్డ్ అవుతాయి
సంబంధిత అధికారుల నుండి ఫార్వర్డ్ అయినా అప్లికేషన్లను పరిశీలించి అర్హత ఉన్న వాటిని(approved) మరియు అర్హత లేని వాటిని(rejected)డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఫైనల్ అప్రూవల్/రిజెక్షన్ చేస్తారు
4. వర్క్‌ఫ్లో & గడువు తేదీ వివరములు(SLA)
సచివాలయంలో దరఖాస్తు సబ్మిట్ అయిన తర్వాత అది ఏయే అధికారుల లాగిన్లకు వెళ్తుంది మరియు ఆమోదానికి ఎంత సమయం పడుతుందో కింద తెలిపిన టేబుల్లో చూడవచ్చు:
| పెన్షన్ కేటగిరీ | అనుసరించే వర్క్‌ఫ్లో (Workflow Chain) | మొత్తం SLA |
|---|---|---|
| స్టాండర్డ్ ప్రాసెస్ (OAP, వికలాంగ, వితంతు) |
DA/WEDS సబ్మిషన్ ➔ WEA/WWDS క్షేత్రస్థాయి విచారణ (11 రోజులు) ➔ MPDO/MC ఫైనల్ అప్రూవల్ (10 రోజులు) | 21 రోజులు |
| ప్రత్యేక విచారణ (ఒంటరి మహిళ, ట్రాన్స్‌జెండర్) |
DA/WEDS ➔ WEA/WWDS (5 రోజులు) ➔ MRO / DMO పరిశీలన (6 రోజులు) ➔ MPDO/MC ఫైనల్ అప్రూవల్ (10 రోజులు) | 21 రోజులు |
| చేనేత కార్మికులు | WEA (5 రోజులు) ➔ Handloom DO (1 రోజు) ➔ Handloom DC (6 రోజులు) ➔ MPDO/MC (10 రోజులు) | 22 రోజులు |
| గీత కార్మికులు | WEA (5 రోజులు) ➔ Excise DC (6 రోజులు) ➔ MPDO/MC ఫైనల్ అప్రూవల్ (10 రోజులు) | 21 రోజులు |
| మత్స్యకారులు | WEA (5 రోజులు) ➔ FDO (1 రోజు) ➔ FDC (6 రోజులు) ➔ MPDO/MC ఫైనల్ అప్రూవల్ (10 రోజులు) | 22 రోజులు |
| డప్పు కళాకారులు & చర్మకారులు | WEA (5 రోజులు) ➔ ASWO (1 రోజు) ➔ SCWELDC (6 రోజులు) ➔ MPDO/MC ఫైనల్ అప్రూవల్ (10 రోజులు) | 22 రోజులు |
📢 లేటెస్ట్ అప్డేట్స్ పొందండి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, సచివాలయ సేవలు మరియు జీవోల సమాచారం ఎప్పటికప్పుడు మీ ఫోన్లో నేరుగా పొందడానికి మన gramawardsevalu.info వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి!
💬 వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి